ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ || 1
(కుడిచేతిలో నీళ్ళు తీసుకుని విస్తరిలోని పదార్థములపై జల్లండి)
స॒త్యం త్వ॒ర్తేన॒ పరి॑షించామి || 2 (ప్రాతః)
[ ఋ॒తం త్వా॑ స॒త్యేన॒ పరి॑షించామి | (రాత్రి) ]
(విస్తరి చుట్టూ ఈశాన్యం నుండి ఈశాన్యం వరకు ప్రదక్షిణ మార్గంగా నీళ్ళు తిప్పండి)
అ॒మృత॑మస్తు | అ॒మృతో॒ప॒స్తర॑ణమసి || 3
(కుడిచేతిలో కొంచెం నీరు తీసుకుని త్రాగండి)
(తరువాత ఎడమచేతిలో ఉన్న పంచపాత్రలోని నీరు కొంచెం భూమి మీద పోసి, పంచపాత్ర పక్కన పెట్టి, విస్తరిని ఎడమచేతి మధ్యవేలితో నొక్కిపెట్టి ఉంచండి)
(ఈ క్రింది మంత్రములు చదువుతూ కుడిచేతి అనామిక-మధ్యమ వ్రేళ్ళతో విస్తరిలోని నెయ్యి వేసిన అన్నం మెతుకులు ఒకటి రెండు తీసుకుని, పంటికి తగలకుండా నాలుకమీద వేసుకుని మ్రింగుతూ ఉండండి)
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” |
ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
బ్రహ్మ॑ణి మ ఆ॒త్మామృ॑త॒త్వాయ॑ || 4
(ఎడమచేయి విస్తరి మీద నుంచి తీసి, ఇంతకుముందు క్రింద వేసిన నీళ్ళను స్పృశించి, విస్తరిలోని భోజన పాదార్థాలను స్వీకరించడం ప్రారంభించండి)
3. ఉత్తరాపోశనమ్
(ఎడమచేతితో పంచపాత్రలోని నీరు కొంచెం కుడి అరచేతిలో పోసుకుని, ఇది చదివి, సగము వరకు తాగండి)
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి స్వాహా” || 1
(మిగిలిన సగం నీళ్ళను, ఈ శ్లోకం చదువుతూ, విస్తరి చుట్టూ ఈశాన్యం నుండి ఈశాన్యం వరకు అప్రదక్షిణముగా చల్లుతూ విడిచిపెట్టండి)
రౌరవేఽపుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు || 2